బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !
శ్రీ యడ్ల రామదాసు గారి భక్తిపాట
==============*=============== =
నాద నామ క్రియ రాగము = ఆటతాళం
దీని బావము దెలియ వలెనయ్యా ! నరులార మీరు ! దేహ వాసన విడువ గదరయ్యా ! దీని బావము దెలియ లేకను ! దేహ వాసన విడువ జాలక ! గాఢ యోగము దాల్చి పుడమిని ! మూఢులై చెడి పోవ నేలను !! దీని !!
వురుము లే నొక మెరుపు మెరిసే ! మబ్బు లే నొక వాన గురిసెను ! వాన గురిసిన కారణము చే ! సోమ సూర్యులు సాము జేసిరి !! దీని !!
ధారుణి తల మందున నవ ద్వార ! వర పుర మందు నిద్దరు ! వీర వర్యులు గూడి ! ఆకస వీధులకు నపు డెగసి పోయిరి !! దీని !!
అర్థ రేయిని లేచి ఖేచరి ! ముద్ర యోగము జూచు వేళలో ! రుద్ర రామా భద్రులకు ! యే రూప నామ క్రియలు లేవు !! దీని !!
మూడు గెలిచే మూడు రోసి ! మూడు ముడా డింట నిలచే ! ఏడు కిటకీల మేడ మీదా ! యెక్కి చూడగా తాను తానై ! ! దీని !!
యి వ్విధంబున నెరుగ జేసిన ! హిత గురువు మంతిన వేంకట ! యతియు మర్మము ! దెలియకను ! మతి లేక జెడి పొయినారు కొందరు ! ! దీని !!
వాసిగా శ్రీ యడ్ల రామా ! దాసు దెల్పిన తత్వ మార్గము ! ఆశతో గను గొన్న వారికి ! అపరిమిత సౌఖ్యంబు గల్గును !! దీని !!
No comments:
Post a Comment